దేశంలో న్యూస్ చానెళ్ళు ఎన్నున్నాయో తెలుసా..!?
========================================
గత దశాబ్దంన్నర కాలంలో మీడియా రంగంలో పెనుమార్పులు వచ్చాయి. ముఖ్యంగా
శాటిలైట్ చానెళ్ల సంఖ్య అమాతంగా పెరిగింది.2000 తర్వాత పెరిగిన ఇండియన్
చానెళ్ల సంఖ్య అనూహ్యంగా ఉంది. ప్రాంతీయ భాషల వారీగానూ ఈ పెరుగుదల
ఎక్కువగానే ఉంది. తెలుగులో కూడా ఈ చానెళ్ళ సంఖ్య పెరుగుదలను
గమనించవచ్చు. జెమీనీ, ఈటీవీలతో మొదలైన ఎంటర్నైమెంట్ విభాగంలో
ఇప్పుడు పది చానెళ్లకు పైగానే ఉన్నాయి. న్యూస్ చానెళ్ల సంఖ్య 20 దాటింది. ఇక సినిమా, చిల్డ్రన్, రిలీజియన్ సహా వివిధ విభాగాల్లో చానెళ్లు పెరుగుతూనే ఉన్నాయి.
========================================

అయితే తెలుగులోనే కాకుండా ఇటీవల ఈ పెరుగుదల అన్ని భాషల్లోనే
మందగించింది. దానికి మీడియాలో మొదలయిన సంక్షోభమే ఓ కారణంగా
కనిపిస్తోంది. చానెళ్ల ఆదాయ పరిమితులు ఏర్పడడంతో పెద్దగా లాభాలు లేని
రంగంలో అడుగుపెట్టడానికి కొందరు వెనుకంజ వేస్తున్నారు. ఓ దశలో పెద్ద
సంఖ్యలో పుట్టికొచ్చిన చానెళ్లు ఇప్పుడు ఒకటి ఆరా మినహా పెద్దగా రావడం
లేదు. తెలుగులో కూడా కొత్త చానెళ్లు వచ్చి చాలా కాలమే అయ్యిందని
చెప్పవచ్చు. ఇంత గ్యాప్ ఈ కాలంలో లేదు.
ఇక ప్రస్తుతం దేశంలో మొత్తం చానెళ్ల సంఖ్య ప్రైవేటు విభాగంలో 886 ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. దానికి అదనంగా సర్కారీ దూరదర్శన్ చానెళ్లు మరో 40 కి పైగా ఉన్నాయి. అందులో 399 న్యూస్ చానెళ్లు కావడం విశేషం. అయితే మొత్తం చానెళ్లలో 768 చానెళ్లకు మాత్రమే అప్ లింక్, డౌన్ లింక్ సౌకర్యం ఉంది. మిగిలినవన్నీ ఇతర దేశాల నుంచి అప్ లింక్ చేసుకుంటున్నట్టు సమాచారం.

Comments
Post a Comment