కాకర (Bitter gourd):
కాకర (Bitter gourd) ఇండియా అంతా పెంచబడుతున్న ఓ చేదు తీగ జాతి మొక్క. దీని శాస్త్రీయ నామం మొమోర్డికా కరన్షియా (Momordica charantia). ఇది కుకుర్బిటేసి (Cucurbitaceae) కుటుంబానికి చెందినది. ఆరోగ్యాన్ని ఇచ్చే కాకర చేదు అయినప్పటికీ మధుమేహానికి మందు గావాడుతున్నారు . కాయ , కాకర రసము , కాకర ఆకులు మందు గా ఉపయోగ పడతాయి. కాకర రసము లో " హైపోగ్లసమిక్ " పదార్ధము ఇన్సులిన్ స్థాయిలో తేడారాకుండా నియంత్రణ చేస్తూ రక్తం లొని చెక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది . కాకర గింజలల లో రక్తము లో గ్లూకోజ్ ను తగ్గించే " చారన్టిన్ " అనే ఇన్సులిన్ వంటి పదార్ధము ఉంటుంది . * తమిళము : పావక్కాయ్ * కన్నడము : హాగల్ కాయి * మళయాలము : కప్పాక్కా * ఓంఢ్రము : కరవిలా * హిందీ : కర్లీ, కరేలా * సంస్కృతము : కారవేల్ల. కాకర రకాలు నల్ల కాకర , తెల్ల కాకర,బారామాసి , పొట్టికాకర ,బోడ కాకర కాయ అని మరొక గుండ్రని కాయ కలదు, ఇది కూడా చేదుగానే ఉండును.
కాకరాకు రసమును కుక్క, నక్క మొదలగు వాటి కాటునకు విరుగుడుగా వాడుదురు.
- కొందరు ఈ ఆకు రసమును గాయాలపై రాస్తారు.
- మరికొందరు దీనిని చర్మ వ్యాదులకు , క్రిమి రోగములకూ వాడురుదు,
- కాకరకాయ అనగానే ఒక్క మధుమేహవ్యాధిగ్రస్తులకే మంచిది అనుకోకండి.
- ఔషధగుణాలున్న కాకరను తరచూ స్వీకరించడం వల్ల రక్త శుద్ధి జరుగుతుంది.
- హైపర్టెన్షన్ని అదుపులో ఉంచుతుంది ఫాస్ఫరస్.
- అధిక మొత్తంలో పీచు లభిస్తుంది.
- సోరియాసిస్‌ను నివారణలో కాకర కీలకపాత్ర పోషిస్తుంది.
- శరీరానికి అత్యావశ్యక పోషకాలైన ఫొలేట్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ కూడా సమృద్ధిగా లభిస్తాయి,
- జీర్ణ శక్తిని వృద్దిచేస్తుంది ,
- చేదు గా ఉన్నందున పొట్టపురుగు నివారణకు ఉపయోగపడును ,
- దీనిలో ఉన్న - మోమొకార్డిసిన్ యాంటి వైరస్ గా ఉపయోగపడును ,
- ఇమ్యునో మోడ్యులేటర్ గా పనిచేయడం వల్ల - కాన్సర్ , ఎయిడ్స్ వ్యాదిగ్రస్తులకు మంచిది ,
- ఇతరత్రా -దీనిని Dysentery , colic, fevers , burns , painful Menstruation ,Scabies, abortifacient మున్నగు వ్యాధులలో వాడవచ్చును .
- కాకరలో సోడియం, కొలెస్ట్రాల్ శాతం తక్కువ.
- థయామిన్, రెబొఫ్లేవిన్,
- విటమిన్ బి6,
- పాంథోనిక్ యాసిడ్,
- ఇనుము, ఫాస్పరస్‌లు మాత్రం పుష్కలంగా లభిస్తాయి.
Comments
Post a Comment