సెక్ష్ సామర్ధ్యము పెంచే ఆహారపదార్ధాలు:

సరైన ఎరెక్షన్ ,అత్యధిక పెరఫామెన్స్ కోసము కొన్ని పదార్థాలు ఉంటాయి ఇంతకు ముందులా శృంగారంలో పాల్గొనలేకపోతున్నారా....? చాలామంది అప్పుడప్పుడు ఇలాంటి అనుభవమే ఎదుర్కునే ఉంటారు. సెక్స్ మీద ఆసక్తి తగ్గడానికి మానసికపరమైన సమస్యలతో పాటు, కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు. కానీ..... చాలామందిలో ఎటువంటి సమస్యలు కనపడదు. అయినా వారిలో ఆ విషయంలో నిస్సత్తువ ఆవరిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం, ఒత్తిడికి దూరంగా ఉండటంతో పాటు మీరు తీసుకునే ఆహారంలో ఈ క్రిందవి తప్పకుండా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటే ఇక మీ శక్తికి తిరుగుండదు.
బాదం, జీడిపప్పు, అక్రోట్స్ వంటి గింజలు క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల లైంగిక పటుత్వం పెరుగుతుంది. అంతేకాదు సంతాన సామర్థ్యాలను పెంచే సెలీనియం, జింక్ తో పాటు బోలెడన్ని పోషకాలు ఉంటాయి.. వీటితో పాటు మెదడులో డొపమైన్ స్థాయలు పెంచడానికి గింజ ధాన్యాలు దోహదం చేస్తాయి. డొపమైన్ సెక్స్ కోరికను పెంచడంతో సెక్స్ పట్ల ఆసక్తి పెరుగుతుంది.
రోజంతా పనిచేసి అలసిపోవడం కూడా శృంగారంపై ఆసక్తి తగ్గడానికి మరో కారణం కావచ్చు. ప్రొటీన్లు దండిగా ఉండే గుడ్లు త్వరగా అలసిపోకుండా చూస్తాయి. కోల్పోయిన శక్తిని తిరిగి పుంజుకోవడానికి తోడ్పడతాయి. స్తంభనలోపం బారిన పడుకుండా చూసే ఆమైన్ ఆమ్లాలు గుడ్లులో లభిస్తాయి రోజూ ఉదయం ఒక గుడ్డు తీసుకుంటే మీరు ఇక అందులో వేరీ గుడ్డే....
స్ట్రాబెర్రీ గింజల్లో జింక్ మోతాదు ఎక్కువ. వీర్యం ఉత్పత్తికి అవసరమైన పురుష హార్మోన్ టెస్టోస్టీరాన్‌ను జింక్ నియంత్రిస్తుంది. సెక్స్ కోరికనూ ఉద్దీపింపజేస్తుంది. మిగతా పండ్ల మాదిరిగా కాకుండా స్ట్రాబెర్రీలను గింజలతో పాటు తింటూ ఉంటాం కాబట్టి జింక్ కూడా దండిగా లభిస్తుందన్న మాట. స్ట్రాబెర్రీలో యాంటీ ఆక్సిడెంట్లు లైంగిక అవయవాలకు రక్త సరఫరా బాగా జరిగేలా చూస్తాయి. ఫలితంగా స్తంభన సమస్యలు తలెత్తకుండా కాపాడతాయి.

ఓ కప్పు కాఫీ లో లభంచేటువంటి కెఫైన్ మెటబాలిజాన్ని మెరుగు పరుస్తుంది. బ్లడ్ పంపింగ్ ను మెరుగుపరిచి ఫ్యాట్ స్టోర్స్ ను విడుదల చెయ్యడము ద్వారా ఇది రాత్రికి సరిపడా శక్తిని ఇస్తుంది.
ఆస్టర్లు సెక్సీ రెప్యుటేషన్ లో వీటి వాడకము అధికము దీనిలో మినరల్ జింక్ , విటమిన్ బి 6 అధికముగా లభిస్తాయి. టెస్టోస్టిరాన్ కు రెండూ కీలకము .
మిరపకాయ తినగానే ముఖము ఉబ్బుతుంది. అంటే రక్తనాళాలు విస్తరిస్తాయి. ముఖములోని రక్తనాళాలే కాకుండా పెనిస్ లోని రక్త సరఫరా మెరుగవుతుంది.
ఉల్లిపాయలు , వెల్లుల్లి లోని " ఫిటోకెమికల్ ఎల్లిసిన్ " రక్తాన్ని పల్చబరిచి , రక్త సరఫరాను పెంచుతుంది . క్లాట్ లు , క్లాగ్ లు తగ్గిపోతాయి.
Comments
Post a Comment