కాబేజీ ఆకులు (Cabbage Leaves) Lettuce (లెట్యూస్):
క్యాబేజీ ఒక ఆకుకూర. ఎందుకంటే సాధారణముగా కాబేజీ మొక్కలో ఆకులతో నిండిన శీర్ష భాగము మాత్రమే తింటారు. ఇంకా ఖచ్ఛితముగా చెప్పాలంటే వృత్తాకారములో ఉండలా ఉండే లేత ఆకులు మాత్రమే ఉపయోగిస్తారు. విచ్చుకొని ఉన్న బయటి ముదురు ఆకులను తీసేస్తారు. ఈ క్యాబేజీ తలను పచ్చిగా, ఉడకబెట్టి లేదా ఊరబెట్టి అనేక వంటకాలలో ఉపయోగిస్తారు. పచ్చి కాబేజీని చేత్తోనే తినేస్తారు కానీ కానీ చాలా ఇతర ఉపయోగాలకు దీన్ని చిన్న ముక్కలుగా లేదా పట్టీలుగా తురుముతారు. కాబేజీ పైన ఉన్న తొక్కలు గట్టిగా అంటుకొని ఆకులు పచ్చగా ఉండవలె, పగుళ్ళు ఉన్న క్యాబేజీ త్వరగా చెడిపోతుంది. ఎరుపురంగు క్యాబేజీ కొన్ని ప్రదేశాలలో మాత్రమే లభిస్తుంది. ముదురు ఆకుపచ్చ రంగు బాగుంటుంది. రక్తములో చెక్కెరస్థాయి సమతుల్యము చేస్తుంది . శరీరములొ కొవ్వు నిల్వలు పేరుకు పోకుండాచేస్తుంది . రక్తములో చెక్కెర స్థాయిని అదుపు చేసేందుకు గ్లూకోజ్ టోలరెన్స్ (glucose tolarence) లో భాగమైన ' క్రోమియం ' ఈ లెట్యూస్ లో పుష్కలముగా ఉంటుంది . నిద్ర పట్టేందుకు దోహదం చేసే " లాక్ట్యుకారియం (Lactucarium)" అనే పదార్ధము ఇందులో ఉంటుంది .

- శక్తి 20 kcal 100 kJ
- పిండిపదార్థాలు 5.8 g
- - చక్కెరలు 3.2 g
- - పీచుపదార్థాలు 2.5 g
- కొవ్వు పదార్థాలు 0.1 g
- మాంసకృత్తులు 1.28 g
- థయామిన్ (విట. బి1) 0.061 mg 5%
- రైబోఫ్లేవిన్ (విట. బి2) 0.040 mg 3%
- నియాసిన్ (విట. బి3) 0.234 mg 2%
- పాంటోథీనిక్ ఆమ్లం (B5) 0.212 mg 4%
- విటమిన్ బి6 0.124 mg 10%
- ఫోలేట్ (Vit. B9) 53 μg 13%
- విటమిన్ సి 36.6 mg 61%
- కాల్షియమ్ 40 mg 4%
- ఇనుము 0.47 mg 4%
- మెగ్నీషియమ్ 12 mg 3%
- భాస్వరం 26 mg 4%
- పొటాషియం 170 mg 4%
- జింకు 0.18 mg 2%

Comments
Post a Comment