బూడిద గుమ్మడి, పుల్లగుమ్మడి (Winter melon):
గుమ్మడి పంటలో రెండో రకం బూడిద గుమ్మడి. దీనికి మార్కెట్లో ఎక్కువ గిరాకీ ఉంటుంది. దీనిని ఎక్కువగా గుమ్మాలకు కట్టుకునేందుకు ప్రజలు ఉపయోగిస్తారు.అంతేగాక పెద్ద హోటళ్లల్లో పెరుగు పచ్చడికి దీన్ని మాత్రమే ఉపయోగిస్తుండటంతో భలే గిరాకీ ఉంది

- ఏ దిష్టీ తగలకూడదనీ బూడిద గుమ్మడి ఇంటి ద్వారానికి కడతాం . సాధారణంగా బూడిద గుమ్మడి కాయ ఐదారు కిలోలు ఉండటం సహజం. అలాగే ఈ గుమ్మడిలో ఔషధ గుణాలూ ఎన్నో ఉన్నాయి. దీనిని చవకరకం కూర అని అనుకోవడం పొరపాటు. బూడిద గుమ్మడి కాయలోనూ విత్తనాల్లోనూ తీగలోనూ కూడా ఔషధ గుణాలున్నాయని వైద్యులు అంటారు.కడుపులో మంట, ఉబ్బరంగా ఉండటం, దాహం ఎక్కువగా ఉన్నప్పుడు బూడిద గుమ్మడి చక్కటి ఔషధంలా పనిచేస్తుంది.
- బూడిదగుమ్మడికాయ అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేవి వడియాలు మాత్రమే. కానీ చలికాలంలో పిందె తొడిగి, వేసవి వరకూ పెద్ద పెద్ద కాయలు కాసే ఈ గుమ్మడితో పసందైన వంటకాలెన్నో చేసుకోవచ్చు. అంతేకాదు, నీరు ఎక్కువుండే బూడిదగుమ్మడిలో కార్బొహైడ్రేట్లు, కొవ్వు అతి తక్కువ శాతం ఉండటంతో డైటింగ్ చేసే వారికి మంచి ఆహారము .

బూడిద గుమ్మడికాయ గురించి తెలియని వారుండరు. కాని దానికి గల విశిష్టఔషధ గుణాలు గురించి చాలామందికి ఎక్కువగా తెలియదు. అందులో ప్రశస్తమైన ఔషధగుణాలు, పోషక లక్షణాలు ఉన్నాయి కనుకనే దానిని 'వైద్య కుష్మాండం' అని 'వైద్య కంబళం' అని ప్రశంసించే వారున్నారు.
- అనేక ఆయుర్వేద మందులు, సిద్ధవైద్య మందులు తయారీలో దీనిని త బాగా వాడతారు. బూడిద గుమ్మడి అనగానే మనకు ఒడియాలు, పేటా అనే స్వీట్ఠక్కున గుర్తుకు వస్తాయి. ఒడియాల రుచి ప్రశ స్తం. ఉత్తరాది మిఠాయి లలో పేటా ప్రముఖ మైనది. ఆగ్రా 'పేటా' మరీ పేరెన్నికగన్నది. హిందీలో బూడిద గుమ్మడిని 'పేటా' అని పిలుస్తారు. కన్నడం వారు తూడగుంబళ అంటారు. 'పుసినికారు' అని తమిళులు, 'కుంభలగా' అని కేరళీయులు పిలుస్తారు.
- ఈ రకం బూడిదగుమ్మడి కాయలు ఆకుపచ్చగా, కోడిగ్రుడ్డు ఆకారంలో ఉండి 750-1000 గ్రాముల బరువు తూగుతాయి. ఎర్రనేలలు, రేగడి నేలలు, ఈ పంటకు మేలైనవి. పాదుపెట్టిన 80-100 రోజులలో కాయలు కాస్తాయి. ఏడాది పొడవునా దీనిసాగు చేయవచ్చు. హెక్టారుకు 4 టన్నులవరకు కాయలుకాస్తాయి.
Comments
Post a Comment